హైదరాబాద్, నిఘా న్యూస్: ప్రస్తుతం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండ వేడిగాడ్పులు అధికంగా ఉన్నాయి. పది నుంచి ఐదు వరకు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదు ముఖ్యంగా 60 దాటిన వారు కచ్చితంగా. శరీరాన్ని కూల్ గా ఉంచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వడదెబ్బకు గురవకుండా చూసుకోవాలి ఉద్యోగరీత్యా లేదా అవత్యవసరం నిమిత్తం బయటికి వెళ్లాల్సివస్తే తలకి టోపీ పెట్టుకోవాలి.. మంచినీరు ఎప్పుడు మనతోనే ఉండాలి సాధ్యమైనంత త్వరగా బయట పనులు ముగించాలి. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది కనుక అరగంటకోసారి మంచినీళ్లు తాగుతూ ఉండాలి. నిమ్మరసం, దోసకాయ, మింట్, మజ్జిగ, పెరుగు, కొబ్బరి నీరు, ఖర్జూర వంటి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం ఎక్కువగా తీసుకుంటుండాలి.
ఆవకాయలకి ఐస్ క్రీమ్ లకి దూరంగా ఉండాలి వేసవికాలంలో మంచి పోషక విలువలు ఉన్న రాగి పౌడర్ చల్లని మజ్జిగలో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే…. బెస్ట్ ఫుడ్ అవుతుంది మన శరీరానికి ఈ వేసవిలో అసలు సీజన్తో నిమిత్తం లేకుండా రోజుకోసారి ఈ పానీయం తీసుకుంటే ఎంతో మంచిది. వేసవిలో అయితే మరోసారి కూడా తీసుకోవచ్చు కాఫీ t20 వేడి పానియాలు తీసుకుంటే ఉదయం 8 గంటలలోపు సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే… అది కూడా రోజుకి రెండుసార్లు మించకుండా తీసుకోవాలని వైద్యుల సలహా…. మైండ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమే ఈ వేసవిలో పిల్లలపై అరుపులు, వాదనలు, వాగ్ వివాదాలు ( మరి ముఖ్యంగా భార్యతో) లేకుండా చూసుకోవాలి లేకపోతే బుర్ర వేడెక్కిపోయి బ్లడ్ ప్రెషర్ తో హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి. ఇది ప్రమాదకరం ముఖ్యంగా వేసవి రోజుల్లో ఇక వస్త్రాధారణలో కూడా కూల్ ని పాటించాలి. దుస్తులు బిగుతుగా ఉండకూడదు కాటన్ వస్త్రాలే ధరించాలి సిల్క్ పట్టు బట్టలు ధరించడం శ్రేయస్కరం కాదు. వేసవి వచ్చేలోపే ఏసీలు సర్వీసింగ్ చేయించుకోవాలి ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తపడాలి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి వేసవిలో స్నానంకి కెమికల్స్ ఉన్న సభ్యులు వాడకూడదు. వేసవి రెండు మూడు నెలలు డెటాల్ సోప్ లేదా నిమ్మ వేప ఉన్న సభ్యులు వాడటం ఉత్తమం. ముఖానికి ఏ టాల్కం పౌడర్ వాడిన ఒంటికి మాత్రం కూల్ మెంట్ గల ప్రిక్ లి పౌడర్స్ మాత్రమే వాడాలి. ఇవన్నీ మనం సులభంగా తీసుకోలేక జాగ్రత్తలే. సో ఈ వేసవిని ఆనందంగా ఆహ్వానిద్దాం పై జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్గా ట్రావెల్ అవుదాం…. అందరికీ హెవీ అండ్ సేఫ్ సమ్మర్ డేస్…