కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వోడితల ప్రణవ్ బాబు
జమ్మికుంట ఫిబ్రవరి 17 ( నిఘా న్యూస్): జమ్మికుంట:కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వోడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీ తీసుకురావాలి,కాంగ్రెస్ పార్టీ కొరకు అందరూ కష్టపడాలి అని అన్నారు.పార్టీ కొరకు వారికి నామినేటెడ్ పదవులలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ లో పరిధిలోని ఏడు నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నియోజకవర్గం లక్ష ఓట్ల పైగా ఓట్లు తీసుకొని రావాలి,కాంగ్రెస్ కార్యకర్తలు గడపగడపకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలి అని అన్నారు.
-ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి….
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీల అతీతంగా నిరుపేదలు లబ్ధి పొందే విధంగా కృషి చేయాలి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా ఊరుకునేది లేదని, పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ అన్నారు.
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
వొడితల ప్రణవ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా ఓట్లు వేసేలే ప్రణాళికలు రూపొందించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీ కార్యకర్తలందరూ ఒక్కతాటిపై నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
అలాగే పార్టీ అభివృద్ధితో పాటు గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులు పార్టీలకతీతంగా పరిష్కరించుకునేందుకు తన సహకారం తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్త లను కోరారు.అందరికీ అండగా నేను కాంగ్రెస్ పార్టీ ఉంటది.అని ఎవరూ అధైర్యపడొద్దని కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట అధ్యక్షులు సుంకరి రమేష్, కసుబోజుల వెంకన్న, పట్టణ మహిళ అధ్యక్షురాలు రేణుక శివకుమార్ గౌడ్, పొన్నగంటి మల్లయ్య ఆరుకల వీరేశలింగం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
గూడెపు సారంగపాణి మొలుగురి సదానందం తదితరులు పాల్గొన్నారు