మైనింగ్ వద్దు అన్నందుకు రైతుల అరెస్ట్
నాగర్ కర్నూలు, నిఘా న్యూస్:నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో గ్రామస్తులను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు గ్రామానికి రాకుండా మహిళలు ముళ్ళకంచ ఏర్పాటు చేశారు.స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు.మా గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున 5గంటలకే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అక్రమంగా అరెస్టు చేసిన గ్రామస్తులను తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికి అయినా సిద్ధమని తేల్చి గ్రామస్తులు చెబుతున్నారు.


