పార్టీ పెద్దల సమిష్టి నిర్ణయంతోనే నాకు పదవి వచ్చింది
కష్ట కాలంలో పని చేసిన వారందరికీ కూడా పదవులు రావాలని కోరుతున్నా
నూతనంగా నియమితులైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ మార్చి 19(నిఘా న్యూస్): అందరినీ కలుపుకొనిపోయి సుడా పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియమితులైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.గతంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా సంస్థ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు పెంచి వీలైనంత సహాయం చేశాము.పిసిసి అధికార ప్రతినిధిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిరంతరం ప్రజల పక్షాన నిలబడ్డాను.మొన్నటి ఎన్నికలలో అసెంబ్లీ టికెట్ ఇవ్వకున్నా క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినాను అని అన్నారు.ఏఐసిసి నాయకులు నాకు సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారని అందులో భాగంగానే నాయకుల సమిష్టి నిర్ణయంతో నాకీ పదవి ఇచ్చారని అన్నారు.గతంలో పిసిసి అధికార ప్రతినిధిగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా నియామకం మంత్రి పొన్నం ప్రభాకర్ వల్లే జరిగిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం అందరి సహకారం వల్లే నాకు సుడా చైర్మన్ నియామకం జరిగిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.గత పది సంవత్సరాలుగా అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేయడంలో పనిచేసిన వారందరికీ కూడా పదవులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.సహకరించిన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విలేఖరుల సమావేశంలో కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్,అఖిల్,కుర్ర పోచయ్య,స్వామిగౌడ్, బొబ్బిలి విక్టర్,ఖంరొద్ధిన్,దన్న సింగ్,నెల్లి నరేష్,మెతుకు కాంతయ్య,షేహెన్ష,పొరండ్ల రమేష్,గంగుల దిలీప్,కీర్తి కుమార్,షబానా మహమ్మద్, ముల్కల కవిత,జ్యోతి రెడ్డి,ఊరడి లత,మేరాజ్,మహాలక్ష్మి,తిరుమల,మహమ్మద్ భారీ,బషీర్,అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.