Friday, February 27, 2026

మేయర్ పీఠం పై బిజెపి గురి తప్పేనా.!

  • గెలుపు గుర్రాలకు కేటాయించనీ బిజెపి టికెట్లు
  • పలువురిలో తీవ్ర అసంతృప్తి


కరీంనగర్ కార్పొరేషన్ కు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంతోకాలంగా బిజెపి లో పలువురు నాయకులు నమ్మిన బంటుగా పనిచేస్తున్నారు. అవకాశం వస్తే కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అయినప్పటికీ పలువురికి బిజెపిలో నిరాశ ఎదురయింది. టికెట్ల కేటాయింపులు గెలుపు గుర్రాలకు కాకుండా కొత్తవారికి కేటాయించారని తీవ్ర అసంతృప్తి నెలకుంది. మేయర్ పీఠం ఈసారి కరీంనగర్ లో దక్కించుకుంటుందని ఆశాభావం మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నప్పటికీ సీనియర్ నాయకులకు టికెట్ల కేటాయింపులో నిర్లక్ష్యం చేయడంతో ఆ కల నెరవేరే అవకాశం లేదని పలువురు నాయకులు వాపోతున్నారు. 66 డివిజన్లో బిజెపి నుంచి 309 మంది నామినేషన్లు వేశారు. కొందరు విత్ డ్రా చేసుకోగా మరికొందరి తిరస్కరణకు గురయ్యాయి. పోటీలో ఉన్న పలువురు టికెట్ దక్కుతుందని నమ్మకంతో ఉన్నప్పటికీ పార్టీ వారికి మొండి చేయి చూపించింది. దీంతో చేసేది ఏమీ లేక తలలు పట్టుకుంటున్నారు. పార్టీ టికెట్ల కేటాయింపులో దిష్టి సాధించకపోవడంతో స్థానిక ప్రధాన నాయకులు వారికి అనుకూలంగా ఉన్న వారికే టికెట్లు కేటాయించి సీనియర్ నాయకులకు మొండి చూపించారని పలువురు వాపోతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular