హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రదర్శన చేస్తున్నారా అనే చర్చ కలకలం రేపుతోంది. “100 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా.. సీఎం సీటు నాది పూచి.. మళ్లీ నేనే సీఎం అవుతాను” అనే ఆయన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తిని రేకెత్తిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
సామాజిక. సమన్వయ బహిరంగ సభలో మాట్లాడుతూ, రేవంత్ తన భవిష్యత్తు సాధించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తనను వ్యతిరేకించే స్వరాలను అణచివేసే ధోరణి, అధికారంలోకి వచ్చిన వెంటనే స్వీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీలోని సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా అణచివేతకు గురవుతున్నారని, ఒకే వ్యక్తి ఆధిపత్యం పెరిగిపోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “పార్టీకి కాకుండా, పదవికి సేవ చేస్తున్నట్లుంది” అని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇదే తరహా ప్రసంగాలు గతంలో కేసీఆర్‌కి కూడా ప్రజా వ్యతిరేకతను తెచ్చిపెట్టిన విషయంలో పార్టీ నేతలే ఆయనకు మళ్ళీ గుర్తు చేస్తారేమో చూడాలి.