వేములవాడ (నిఘా న్యూస్) : కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి స్వతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలిదశ పోరాట నాయకుడు అపరమేధావి రాజకీయ చాణిక్యుడు ప్రతిపక్షము లో ఉన్న ప్రజా సమస్యలు అభివృద్ధి పనులు సాధించి రాజకీయ జీవితంలో మచ్చలేని మహనాయకునిగా సిరిసిల్ల వేములవాడ నియోజక వర్గ ప్రజల తో ఎంతో అనుబంధం సంపాదించిన చెన్నామ నేని రాజేశ్వరరావు ఆయన వారసుడు రమేష్ బాబు తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వేములవాడ గడ్డ మీద ఓటమి ఎరుగని నాయకుడిగా పెరుతెచ్చుకున్నరు.

రాజకీయ పార్టీ ఏదైనా గెలుపు చెన్నామనేని అనే అంత ప్రజ బలం పాదించుకొన్నారు కానీ భారత పౌరసత్వ కేసు లో హై కోర్టు ఇచ్చిన తీర్పుతో రమేష్ బాబు రాజకీయ భవితవ్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి హై కోర్ట్ తీర్పు తోఓటర్ జాబితా నుంచి చెన్నమనేని రమేశ్ పేరు తొలగింపు కై రెవెన్యూ శాఖ నోటీసు జారీచేసి నట్లు తెలియడం వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరును ఎన్నికల ఓటర్ జాబితా నుండి తొలగించేందుకు రమేష్ బాబు ఇంటికి నోటీసులు అంటించిన రెవెన్యూ అధికారులు రాష్ట్ర హైకోర్టు చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడైనని నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుండి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు వేములవాడలోని నివాసానికి నోటీస్ అందజేసి రిజిస్ట్రార్ పోస్ట్ చేసిన అధికారులు…ఓటర్ జాబితా నుండి పేరు తొలగింపు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 02 తేదీ లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్న అధికారులు..
రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుండి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించిన రెవిన్యూ అధికారులు.. ఓటర్ జాబితా నుండి చెన్నామనేని రమేష్ బాబు ను తొలగిస్తే చెన్నామనేని రాజకీయ భవిష్యత్ వారసత్వం ఎవరైయిన కొనసాగిస్తారా లేదా అని నియోజకవర్గ ప్రజలు ఎం జరుగుతుందోనని చర్చించు కొంటున్నారు ఏదీ ఏమైనా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుకు చెన్నామనేని స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సింది.