హుస్నాబాద్, నిఘా న్యూస్: భారత రాష్ట్ర సమితి భీమదేవరపల్లి మండల ముఖ్య కార్యకర్తల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టడం, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి ప్రజలకు వివరించడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన ప్రాధాన్యతను BRS పార్టీ శ్రేణులకు వివరించారు,అలాగే కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడు ఉంటానని అదైర్యపడవద్దని బరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
