Sunday, August 3, 2025

జార్ఖండ్‌ తుపాకులు ఆంధ్రాకు ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి?

విశాఖట్నం (నిఘా న్యూస్): గత కొన్ని రోజుల నుంచి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది వైజాగ్. పొలిటికల్‌గా మాంచి కాక మీదున్న విశాఖ… భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ ఛేజింగ్‌తో మరింత వేడెక్కింది.లేటెస్ట్‌గా రెండు గన్నులతో పాటు, మూడు బుల్లెట్లు దొరకడం… అదీ ఓ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి వీటిని విశాఖకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్‌ మేనేజర్‌ శివనాగరాజు అనే వ్యక్తి నుంచి రెండు తుపాకులు, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే శివనాగరాజును అరెస్ట్‌ చేసి ఆరా తీస్తే… షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. ఈ పిస్టల్స్‌ తనవి కాదని… జార్ఖండ్‌కు చెందిన వ్యక్తివిగా శివనాగరాజు చెప్పడం చర్చనీయాంశమైంది. కునాల్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి వైజాగ్‌ నుంచి బెంగళూరు వెళ్తూ బస్సులో వీటిని మరిచిపోతే తాను తీసుకున్నానని, ఈ తుపాకులకు తనకు ఎలాంటి సంబంధం లేదనడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. అసలీ కునాల్ శ్రీవాత్సవ ఎవరు..? ఏపీకి ఎందుకొచ్చాడు..? తుపాకీలు ఎందుకు తీసుకొచ్చాడు…? ఎవరికి ఇవ్వడానికి తెచ్చాడన్న… ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు విశాఖ పోలీసులు. జార్ఖండ్‌ వ్యక్తికి వైజాగ్‌ ఏం పని…?వైజాగ్‌ నుంచి బెంగళూరు ఎందుకెళ్లాడన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్షన్‌ టైమ్‌ కావడంతో ఈ తుపాకుల కేసుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇదిలా ఉంటే మరోకేసులో 7వందల ఈ సిగరెట్లను వైజాగ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 లక్షల విలువ చేసే ఈ సిగరెట్లను ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఓ ఇద్దరిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా… ఎన్నికల వేళ వరుస ఘటనలు వైజాగ్‌ పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular