Wednesday, August 6, 2025

ఎస్సారెస్పీ భూములను కాపాడేదెవరు?

కరీంనగర్ జిల్లా చింతకుంటలో అక్రమ నిర్మాణాలు

మున్సిపల్, రెవెన్యూ అధికారుల అండదండలు?

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలో భూ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడా ప్రభుత్వ భూమి కనిపించినా.. అందులో కొందరు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే అందులో కట్టడాలు చేస్తున్నారు. గతంలో కరీంనగర్ లో భూ ఆక్రమాలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. కొందరు పట్టీ పట్టనట్లు తమ పని తాము చేసుకుంటున్నారు. అయితే కరీంనగర్ శివారులోని చింతకుంట గ్రామం పరిధిలో ఉన్న ఎస్సారెస్పీకి సంబంధించిన భూమిలపై కొందరు కన్నేశారు. చింతకుంట గ్రామ పరిధిలో ఉన్న ఎస్సారెస్పీకి చెందిన ఎకరంన్నర భూమిలో కొందరు కట్టడాలు నిర్మించడం చూస్తే ఈ భూ దందా ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

చింతకుంట గ్రామంలో ఎస్సారెస్సీ ప్రధాన కాలువ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలువ గుండా ఉన్న కొన్ని కొన్ని భూములు ఇప్పటికీ ఎస్సీరెస్పీ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఈ భూములను కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చింతకుంట మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నందున.. ఈ కార్యాలంలోని కొందరు ఉద్యోగులతో కలిసి ఇందులో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరికి రెవెన్యూ అధికారులు కూడా సహకరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవి ప్రభుత్వ భూములు అని తెలిసినా.. అక్రమార్కులు నిర్మాణాలు చేపడితే వారు చూస్తూ ఉండడం తప్పం ఏమీ చేయడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఎస్సారెస్పీ భూముల్లో కొన్ని ఇళ్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

అయితే సమీపంలోని వారు ఈ తతంగం గురించి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలియజేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు ఆయా శాఖల అధికారులు సహకరించడం వల్లే ఈ నిర్మాణాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చింతకుంట గ్రామంలోని ఎకరంన్నర భూమిలో ఈ నిర్మాణాలు కనిపిస్తుండడంతో ఈ మొత్తం భూమి ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఎస్సారెస్పీకి చెందిన విలువైన భూములు అక్రమార్కుల పాలు కాకుండా చూడాలని కోరుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular