కుల గణన ఓ బోగస్ ప్రక్రియ
పట్టభద్రులు టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి
పట్టభద్రుల సమావేశంలో బిజెపి ఎంపీ డాక్టర్ కే .లక్ష్మణ్
కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్)కరీంనగర్ లోనే శుభమంగళ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎంపీ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సామాజిక వర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని రేవంత్ రెడ్డి మతి తప్పిందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అధికారంలో ఉన్నామని విర్ర వీగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్టేషన్ లో అవాకలు చవాకులు పేలుతున్నాడు అన్నారు కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అందుకే ప్రజల దృష్టిలో మరల్చడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగలన ఓ బోగస్ ప్రక్రియ అన్నారు హిందూ ముస్లిం , బీసీ ముస్లిం అని ప్రపంచంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే లెక్కలు బోగస్ అని తేరడంతోనే మళ్లీ సర్వేకు అవకాశం ఇచ్చారన్నారు కులగనన పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని బీసీలకు చేస్తున్న ద్రోహానికి ప్రభుత్వం బీసీలు కూడా కాంగ్రెస్ వైపు లేరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని కసి ప్రజల్లో ఉందన్నారు మొన్న కెసిఆర్ నిన్న కేజ్రివాల్ వాళ్లకు పట్టిన గతే నీకు పడుతుందని ఆయన హెచ్చరించారు ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలనె కాంగ్రెస్ కు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు టీచర్స్ తగిన బుద్ధి చెప్పాలన్నారు బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు సమావేశంలో బిజెపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ ,వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి కృష్ణారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ,మాజీ మేయర్లు డి.శంకర్ సునీల్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,మాడ వెంకటరామిరెడ్డి కార్యకర్తలు పట్టబద్రులు పాల్గొన్నారు.