విశాఖపట్నం, ఏప్రిల్ 20, నిఘా న్యూస్: దక్షిణ నియోజకర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వాకర్స్ అసోసియేషన్, జిమ్ అసోసియేషన్, లాఫింగ్ క్లబ్, సభ్యులను కలసిప్రతి రోజూ నడవటం వలన ఆరోగ్యం కు ఎంత మంచి చేస్తుందో, కూటమి గెలుపు కూడా మన జీవితం వెలుగు నింపుతుంది అందుకు కోసం గాజు గ్లాస్ గుర్తు పై తనకు, సైకిల్ గుర్తు పై ఎంపీ అభ్యర్థి అయిన భరత్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు .పార్క్ పరిసర ప్రాంతాలలో వాకర్స్ ను, క్రీడాకారులను ,వ్యాయామం చేస్తున్న మహిళలను స్వయంగా కలిసి గాజు గ్లాస్ కి, సైకిల్ కి అవినీతిపై ఓటు వేయాలని కోరారు. యువత దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మీరే అంటూ సెల్ఫీలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. పార్కు చుట్టూ మరియు పార్క్ బయట ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.
నడక ఆరోగ్యం కోసం.. కూటమి గెలుపు మీ జీవిత వెలుగు కోసం..
RELATED ARTICLES