వరంగల్, నిఘా న్యూస్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ వడ్డేపల్లి కనకదుర్గ కమ్యూనిటీ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 303 కార్యవర్గ సమావేశం నిర్వహించారుఈ సమావేశంలో 2022 నుండి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలు కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయుటకు ఇక్కడి వాకర్స్ సంఘాలు చేయుచున్న విజ్ఞప్తి ని డిస్ట్రిక్ట్ 303 వాకర్స్ పెద్దలు అనగా బాద్యులు పరిశీలించి ఇంటర్నేషనల్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ నియమావలిని అనుసరించి నూతన జిల్లా ఏర్పాటు అంగీకరించి కౌన్సిల్ లో తీర్మానం చేసి ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కు పంపడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో ఏవీపీ తడక కుమారస్వామి గారు, RC చింతం సారంగపాణి గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ కూరాకుల భారతి గారు, పాస్ట్ గవర్నర్ ఎల్లగౌడ్ గారు, నర్సింహారావు గారు, దేశిని లష్మినారాయణ గారు, జంగా గోపాల్ రెడ్డి,నూతన జిల్లా 304 గవర్నర్ గా సుధాకర్ రావు అన్నమనేని గారిని ప్రకటించినారు,గొట్టిముక్కుల రవీందర్, గుడిపాటి రమణ రెడ్డి, పెంచల కిషన్ రావు, సమ్మిరెడ్డి, కనకచారీ, వెంకట్ రెడ్డి,అశోక్ రావు, దామోదర్ చారీ, హన్మాండ్లు, వేల్పుల వెంకటేష్, బండవరం సుమన్, అశోక్, మరియు కరీంనగర్ నుండి వివిధ వాకర్స్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని స్వీట్ పంపిణి చేసి సంతోషం వ్యక్తం చేసినారు
వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కార్యవర్గం
RELATED ARTICLES