Saturday, August 2, 2025

టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ?

హైదరాబాద్, నిఘా న్యూస్: భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలపగా, నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్.. అంటూ సోషల్ మీడియా వేదికాగా భారత టెస్ట్ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు.

టీమిండియాను ముందుం డి నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారంలోపే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిం చడంతో క్రికెట్ అభిమాను లు తీవ్ర నిరాశకు లోనవు తున్నారు. వీరిద్దరి నిర్ణయా లు భారత క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలికాయి.

ఇకపోతే, విరాట్ కోహ్లీ 2015 నుండి 2022 వరకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా 68 మ్యాచ్‌లకు నాయక త్వం వహించారు. ఈ సమయంలో భారత్ 40 మ్యాచ్‌లను గెలిచింది. 17 మ్యాచ్‌లను ఓడింది. అలాగే 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఈ గణాంకాలు కోహ్లీని భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంత మైన కెప్టెన్‌గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్ కెప్టెన్సీలో అతని 40 విజయాలు గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత నాల్గవ స్థానంలో నిలబెట్టాయి.

కోహ్లీ నాయకత్వంలో, భారత్ 2018-19లో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధిం చింది. అలాగే, 2021లో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అతని నాయకత్వంలో, భారత్ 42 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

కోహ్లీ కెప్టెన్సీలో 54.80 సగటుతో 5864 పరుగులు సాధించారు. అతను కెప్టెన్‌గా 20 శతకాలు సాధించి, భారత టెస్ట్ కెప్టెన్సీ చరిత్రలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడి గా నిలిచారు. 2022లో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, అతని నాయకత్వం భారత టెస్ట్ క్రికెట్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.

ఇక రోహిత్ విషయానికి వస్తే.. 2022లో విరాట్ కోహ్లీ రాజీనామా చేసిన తర్వాత, రోహిత్ శర్మ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుల య్యారు. ఆయన 24 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. ఇందులో 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రా మ్యాచ్‌లు ఉన్నాయి. రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌ను 61 మ్యాచ్‌లు ఆడి, 4,301 పరుగులు చేసి, సగటు 40.57తో ముగించారు.

రోహిత్ కెప్టెన్‌ గా కొనసాగిన సమయంలో రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు చేరుకున్న విజయం సాధించలేకపో యారు.ఇక వీరిద్దరి వీడ్కోలుతో, భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది.

ఇకపై భారత టెస్ట్ క్రికెట్ ను జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జట్టు ను ముందుకు నడిపించేం దుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో, ఈ యువ ఆటగాళ్లు భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular