కరీంనగర్, నిఘా న్యూస్: కొత్తపల్లి లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమృద్ధి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని రాజేందర్ రావు ప్రార్థించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని వినాయకుడిని వేడుకున్నారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ఇంటింటా సుఖశాంతులు, ఆనందాలు నిండాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలందరికీ రాజేందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిచాల ప్రజా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వెలిచాల ప్రజా కార్యాలయంలోఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
RELATED ARTICLES