తీసుకునేది ఎక్కువ ఇచ్చిన బిల్లులో ఉండేది తక్కువ
రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 30 (నిఘా న్యూస్) బాణాసంచా (హోల్ సేల్) దుకాణంలో వినియోగదారులను నిలువుదోపిడి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బాణసంచా విక్రయదారు లు 1,86 760 కొనుగోలు చేయగా వారికి 43500 బిల్ ఇచ్చి పంపారు. వారు చూసుకోక వారు గమ్యానికి కి వెళ్ళగా.. సేల్ టాక్స్ వారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారికి బిల్లు రిసిప్ట్ ఇవ్వగా అది 43500 ఉంది మీరు తీసుకున్నది ఎక్కువగా అనగా.. ఆ బిల్లు చూసిన వినియోగదారులు ఏమి చెయ్యాలో తెలియక లబోదిబోమంటున్నారు. ఇలా తెలియని వారికి మోసం చేయడం ఎంతవరకు సబబు అని వినియోగదారులు మా లక్ష్మి బాణాసంచా (గజ్వేల్) హోల్సేల్ షాప్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకా మోసాలకు పాల్పడటమ్ పై ఫైర్ అధికారులు కలక్టర్ గారు చర్యలు తీసుకోవాలని ప్రజలు కొరుతున్నారు.