వేములవాడ, నిఘా న్యూస్ : తెలంగాణలోనే అతి పెద్దపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దసరా పర్వదిన మహోత్సవాల లో భాగంగా పండితులు వేదమంత్రాలు చదువు తుంటే మంగళ వాయిద్యాలతో డప్పు చప్పుళ్లతో శోభాయాత్ర లు ఘనంగా జరిగాయి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వామివార్లు గజ వాహనముపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రజలంతా దేవాలయంలో రాజరాజేశ్వర స్వామిని అమ్మవార్లను దర్శనం చేసుకొని దేవాలయం ముందు ప్రాంతంలో ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవాలయ అధికారులు పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు పట్టణ ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



