వేములవాడ, నిఘా న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ను వేములవాడలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధంచి వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1000 గజాల స్థలం కేటాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంత రావు నుంచి అందుకున్నారు. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటుపై హర్షం వ్యక్తం అవుతోంది.
వేములవాడ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు
RELATED ARTICLES


