అల్గునూరు చౌరస్తా నుంచి భారీ ర్యాలీ ఘన స్వాగత కార్యక్రమం
కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు మొట్టమొదటిసారిగా ఈ నెల 13వ తేదీన మంగళవారం కరీంనగర్ రానున్నారు. అలుగునూరు చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ వివిధ సంఘాల నాయకులు ముఖ్యులు, అభిమానులు వెలిచాల రాజేందర్ రావుకు ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం వారితో కలిసి భారీ ర్యాలీ మధ్య వెలిచాల రాజేందర్ రావు గీత భవన్ చౌరస్తా వద్దకు చేరుకుంటారు. అక్కడ జరిగే సంబురాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:00గంటకు డిసిసి కార్యాలయంలో రాజేందర్ రావు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, టిపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు వివిధ నామినేటెడ్ హోదాల్లోని నాయకులు ముఖ్య నేతలు. బ్లాకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు.. అనుబంధాల సంఘాలు అనుబంధ విభాగాల అధ్యక్షులు.. నాయకులు.. రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు జిల్లా కార్యవర్గ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు..పలువురు నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు కార్యకర్తలు వెలిచాల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వెలిచాల ప్రజా కార్యాలయం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.


