‘నిఘా న్యూస్’ చెప్పింది నిజమైంది..
కరీంగనర్, నిఘా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్తిగా వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నే అని డిక్లేర్ అయింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు అధికారికంగా వెలిచాల రాజేందర్ రావు పేరును ప్రకటించలేదు. నిన్నటి వరకు ప్రవీణ్ రెడ్డికే టికెట్ కన్ఫామ్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంతో ఈయనకే టికెట్ ఖరారు అని తెలుస్తోది.
గత కొన్ని రోజులుగా కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిపై తీవ్రఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘నిఘా న్యూస్ ’ కరీంనగర్ స్థానాన్ని వెలిచాల రాజేందర్ రావుకే కేటాయిస్తారన్న కథనం వెలువరించింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీంతో కరీంనగర్ లో ఎన్నిలక పోరు తీవ్రం కానుంది.
