కరీంగనగర్, నిఘా న్యూస్: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.
ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధి & మౌలిక వసతులు – రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చ జరిగింది. కరీంనగర్ నగర అభివృద్ధిపై మంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెలిచాల రాజేందర్రావు ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని, కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రాజేందర్ రావు తెలిపారు. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు విజయం సాధించేలా ఇప్పటినుంచే కార్యచరణ రూపొందించుకొని ఆ దిశగా కృషి చేస్తున్నామని రాజేందర్రావు పేర్కొన్నారు.