Friday, February 27, 2026

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ‘వెలిచాల’ ప్రచారం..

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ పట్టణంలోని 39వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ గారికి మద్దతుగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు గారు ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పదేండ్లలో కాని సంక్షేమాభివృద్ధి రెండేళ్ల ప్రజాపాలనలో సాధ్యమైందని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. విపక్షాలు చేసే కుట్ర రాజకీయాలను ఓటుతో ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular