కరీంనగర్, నిఘాన్యూస్:స్థానిక కట్టరాoపూర్ లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి సరస్వతి దేవి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమమును వేద బ్రాహ్మణుల సమక్షంలో పాఠశాల కరస్పాండెంట్ దంపతులు శ్రీమతి శ్రీ గున్నాల అర్చన క్రాంతి కుమార్ లు సరస్వతి దేవి పూజా కార్యక్రమమును నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమమును ప్రారంభించారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల తరఫున విద్యార్థులకు కావలసినటువంటి పలకలు, స్లేట్ పెన్సిల్స్ మరియు వివిధ సామాగ్రిని ఇవ్వడం జరిగింది.
అలాగే పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా వేద బ్రాహ్మణులచే ఆశీర్వచనం ఇప్పించడం జరిగింది మరియు వచ్చే సంవత్సరం 10వ తరగతి చదువు విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ గారైన శ్రీ గున్నాల క్రాంతి కుమార్ గారు పదవ తరగతి అన్ని సబ్జెక్టులకు సంబంధించి వివిధ అకాడమిక్ స్టాండర్డ్స్ ల గురించి మరియు మొదటి రోజు నుంచే పదవ తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి అనే విషయాన్ని మరియు నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఏ విధంగా రాయాలి అనే వివిధ అంశాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దంపతులు శ్రీమతి శ్రీ గున్నాల అర్చన క్రాంతి కుమార్ లు, డైరెక్టర్ దశరథం గారు, విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.