హైదరాబాద్, నిఘా న్యూస్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమాన స్నేహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1: 45 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి. 2 నుంచి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే అధికారులతో సమావేశం కానున్నారు..మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామా బాద్ లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.2:45 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నా రు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.