Wednesday, March 4, 2026

మళ్లీ ఒకే ఒరలోకి రెండు కత్తులు?

కరీంనగర్, నిఘా న్యూస్:. మాల పురిటిగడ్డగా పేరున్న కరీంనగర్లో రాజకీయం నిత్యం రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి లో కలిసి మూడు పార్టీలు ఇక్కడ తమ ప్రాతినిత్యాన్ని చాటుకుంటున్నాయి. అన్ని పార్టీలోని నాయకులు తమ పార్టీ అభివృద్ధి కోసం కోసం నిత్యం పాటుపడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ కు.. ఆ తర్వాత బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో.. ఇప్పుడు బిజెపి బాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరి నేతలను ఇతర పార్టీల నుంచి నాయకులను బిజెపి నాయకులు చేర్చుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తో పాటు కొందరు కార్పొరేటర్లు బిజెపిలోకి చేరారు. అయితే ఆ తర్వాత కూడా ముఖ్యమైన నేతలు కమలం తీర్థం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న సునీల్ రావు ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆయనతో పాటే మరికొందరు నేతలు బిజెపిలోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ తన వ్యూహంతో కరీంనగర్లోని ముఖ్యమైన నాయకులను బిజెపిలోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బిజెపిలోకి చేరే నాయకుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం బీ ఆర్ఎస్ నగర అధ్యక్షుడిగా ఉన్న చల్లా హరిశంకర్ సైతం ఆయన వెంటే కాషాయం కండువా కప్పుకుంటున్నారని జోరుగా చర్చ సాగుతుంది.

అయితే ఇలా బీఆర్ఎస్ లోని నాయకులు బిజెపిలోకి చేరడం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనే చర్చ ఇప్పటినుంచే సాగుతోంది. సాధారణంగా ఏ పార్టీలోనైనా అగ్రవర్ణాలు కు బీసీ నాయకులకు మధ్య పోరు ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సునీల్ రావు బిజెపిలోకి చేరారు. అయితే ఒకవేళ గంగుల కమలాకర్ తో పాటు మరికొందరు బిజెపిలోకి వెళితే అప్పుడు మళ్లీ సునీల్ రావు, గంగుల కమలాకర్, చల్లా హరిశంకర్ మధ్య పోరు ఉంటుందా..? అని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా కొందరు నాయకులు ఒకే ఒరలో రెండు కత్తులు ఇమ్ముడుతాయా.? అని అనుకుంటున్నారు.

మొన్నటివరకు బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో యాదగిరి సునీల్ రావు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. సునీల్ రావు ఆ మధ్య విదేశాలకు వెళ్ళినప్పుడు తమకు చార్జి ఇవ్వలేదని చల్లా హరిశంకర్ ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఆ సమయంలో వీరిని ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు సునీల్ రావు ఇతర పార్టీలోకి వెళ్లిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తమకు మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాట్లు చర్చ సాగుతోంది. మరికొందరు మాత్రం చల్ల హరి శంకర్ సైతం బిజెపిలోకి చేరుతారని అంటున్నారు. ఒకవేళ చల్లా హరిశంకర్ బిజెపిలోకి చేరితే మళ్ళీ పాత ఫోరే ఉంటుందా..? అని అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మరోసారి ఒకే ఊరిలో రెండు కత్తులు అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితి మళ్ళీ బిజెపిలో ఉంటుందని చర్చించుకుంటున్నారు అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular