సిరిసిల్ల,కలెక్టరేట్ ఏప్రిల్ 6, (నిఘా న్యూస్ ):యాసంగి- 2023-24 సీజన్ కి సంబందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఏ పీఎంలు, కేంద్రాల ఇంచార్జీలు, బుక్ కీపర్లు, కమిటీ సభ్యులకు శనివారం శిక్షణ ఇచ్చారు. డీఆర్డీఓ కార్యాలయానికి కేటాయించిన వరి ధాన్యం (44) కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై డీఆర్డీఓ శేషాద్రి మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్యాడీ క్లీనర్ ద్వారా పట్టిన ధాన్యాన్ని సంబందిత ఏఈఓ సర్టిఫై చేసి ధాన్యమును మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాట్ చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రములో ఎటువంటి సమస్యలు రాకుండా, సజావుగా సాగేలా చూసుకోవాలని, షిప్ట్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఓపి ఏం ఎస్ లో సవరించిన విధానం ఆధారంగా కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి ఐరిష్ రైతు వారీగా నమోదు చేయాలని, తాగునీరు, నీడ సౌకర్యం ఉండేలా చూడాలని వివరించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల డీఎం జితేంద్ర ప్రసాద్, అదనపు డీఆర్డీఓ జీ శ్రీనివాస్, డీపీఎం పాపారావు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు
సరిత – జిల్లా సమాఖ్య కార్యదర్శి రజిత, సివిల్ సప్లై కార్యాలయం సిబ్బంది నాగాచారి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ
RELATED ARTICLES