కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన భూ భారతి పథకం లైసెన్స్ ట్రైనింగ్ సర్వేయర్ లో భాగంగా శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ శిక్షణ కోసం జూన్ 26న దరఖాస్తులను ఆహ్వానించగా 500 మంది అప్లై చేసుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించి 278 మంది సెలెక్ట్ చేశారు. వీరిలో 150 మందికి బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో, మిగతా వారికి జడ్పీ కార్యాలయంలో శిక్షణ ఇప్పించారు. జూన్ 27,28, 29 తేదీల్లో ఈ శిక్షణ తరగతులు కొనసాగాయి. ఇటీవల వీరికి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ మోయిజ్ ఖాన్, ప్రభుత్వ సర్వేయర్లతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్లు ఎల్ కృష్ణ, జగన్, పాల్, శ్రీనివాసరావు, నరేశ్, కరుణాకర్, శివకృష్ణ, సురేష్, జీవన్ రెడ్డి, మురళి, శ్రీను, కుమార్, సంపత్, రవళి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ సర్వేపై యువకులకు శిక్షణ తరగతులు
RELATED ARTICLES