హైదరాబాద్, నిఘా న్యూస్: బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి నుండి వైభవంగా ప్రారంభమయ్యా యి, ఉదయం ఎల్లమ్మ తల్లిని పెళ్లి కుమార్తెను చేశారు.రాత్రి 7 గంటలకు వేద పండితులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరము ఎదురుకోళ్లు కార్యక్రమము భారీ ఊరేగింపుతో ఘనంగా జరిగింది,
మంగళవారం ఉదయం 11:51గంటలకు అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మ వారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు.
పుట్ట మన్ను తీసుకొచ్చి SR నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు తో ఎదురుకోళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,మంత్రి పొన్నం ప్రభాకర్, సమర్పించనున్నారు.
అదేవిధంగా ఈనెల 10న సాయంత్రం 6 గంటలకు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాను న్నారు. అమ్మవారి కళ్యాణో త్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్,ప్రధాన మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి 80 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.