Monday, August 4, 2025

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవం

భువనేశ్వర్, నిఘా న్యూస్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి స్వామి వారి బాహూదా రథయాత్ర కొనసాగుతుంది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మంది భక్తులు తరలిరావ డంతో పూరీ ప్రాంతం జనసంద్రంగా మారనుంది . 12రోజుల పాటు ఉత్సవా లు జరుగుతాయి.ఈ నెల 7వ తేదీన ప్రారంభ మైన పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం.. ప్రతీ యేటా ఆషాడ శుద్ధ తదియ రోజున ప్రారంభమవు తుంది.

ఏ హిందూ ఆలయం లోనై నా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ, పూరీ జగన్నాధుని ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్ర లో భక్తులకు కనువిందు చేస్తారు.మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయా త్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు.

జగన్నాథుడి రథాన్ని ‘నంది ఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మ ధ్వజం’ అని భక్తులు పిలుస్తారు.ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరి స్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భ గుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular