తిరుపతి, నిఘా న్యూస్:కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, కొలిచేందుకు నిత్యం భక్తులు బారులు తీరుతుంటారు. తిరుమల దేవస్థానంలో ప్రతినిత్యము పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి, ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్స వాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అకురార్పణం జరగనుంది.వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైంది.
ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురా ర్పణ నిర్వహిస్తుంటారు.ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిం పుగా వెళ్లి బ్రహ్మోల్సవాల ఏర్పాట్లను పర్యవేక్షి స్తుంటారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమా ల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం పుట్టమన్నులో నవధాన్యాలు నాటుతారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స వాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్బచాప, తాడును టీటీడీ అటవీశాఖ కార్యాలయం నుంచి బుధవారం డీఎఫ్ వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువ చ్చారు..