Thursday, March 5, 2026

వేములవాడలో త్యాగరాజ ఉత్సవాలు ప్రారంభం..

వేములవాడ జనవరి 18 (నిఘా న్యూస్):దక్షిణ కాశి వేములవాడలో శనివారం నుండి ఐదు రోజులపాటు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగాజరుగుతాయికళలు అంతరించిపోకుండా, కళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 72వ నాద బ్రహ్మ లయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. త్యాగరాజ స్వామి సుప్రభాతంతో ప్రారంభమైన ఉత్సవాలు సంగీత సుప్రభాత రూపకం నాదస్వర కచేరి, స్వస్తి పుణ్యాహవచనం నగర సంకీర్తన జ్యోతి ప్రచురణలతో పాటు వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న కళాకారుల చేత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..త్యాగరాజ కీర్తనలతో దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని అంత గొప్ప కీర్తనలు అని ప్రజలకు తెలియజేశారని అన్నారు . ఏడు దశాబ్దాలుగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా త్యాగరాజ స్వామి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు, తెలుగువాడైన త్యాగరాజు స్వామి కర్ణాటక సంగీతంలో పేరు ప్రఖ్యాతలు గడించారని కొనియాడారు. త్యాగరాజ ఉత్సవాల్లో వివిధ కళ్ళల్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పించి కలలు అంతరించిపోకుండా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు
శ్రీ త్యాగరాజ స్వామి వారి జీవిత చరిత్ర, పంచరత్న గానం, హరికథ లను కళాకారులు ప్రదర్శించారు. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవమూలలో ప్రధానంగా సుప్రసిద్ద కళాకారులచే శాస్ర్తీయ, భక్తీ, సంగీత, సోలో, హరికథ, నృత్యా, హరికథ, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలుంటాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి ఆలయంలో గత 72 ఏళ్లుగా శ్రీ త్యాగ రాజ స్వామివారి అరాధనోత్సములను ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వాగ్దేయకారుడు త్యాగరాజు రచించిన శ్రీ రామ సంకీర్తనలు ఎంతో గుర్తింపు పొందాయి . కర్ణాటక సంగీతంలో ఎంతో పేరు ప్రతిష్టతలు సంపాదించిన శ్రీ త్యాగ రాజస్వామి వారి జన్మదినం రోజున సంగీత దినంగా అరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి రాష్ర్ట వ్యాప్తం కాకుండా పక్కా రాష్ర్టాల నుండి సైతం కళాకారులు ఆరాధానోత్సములలో పాల్గొంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular