పెద్దపల్లి, నిఘా న్యూస్ :పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మాదక ద్రవ్యాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసు లు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.మంథని సబ్ ఇన్స్పెక్టర్ డేగ రమేష్,ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, ఆదేశ్, సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ పట్టివేత జరిగింది. పక్కా సమాచారంతో మంథని సమీపంలోని గాడుదుల గండి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి సుమారు 120 గ్రాముల లభ్యమైంది.
గంజాయితోపాటు రెండు మోటార్ సైకిళ్ళు రెండు మొబైల్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మంథని మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన చందు సంతోష్, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామానికి చెందిన కోల శ్రావణ్, అల్లెం అరుణ్, గా పోలీసులు గుర్తించారు.ఈ సందర్భంగా ఎస్సై డేగ రమేష్,మాట్లాడుతూ..జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరిక ట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


