రాజన్న సిరిసిల్ల డిసెంబర్ 1 (నిఘా న్యూస్): ఎల్ఐసీ సంస్థలో ప్రతిష్టాత్మకమైన ఎండిఆర్టీ అర్హతను సాధించిన ముప్పిడి సుధీర్ కుమార్ ని ఎల్ఐసీ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ జై కిషన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
దీనికి కృషిచేసిన వికాసాధికారి సంతోష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా సన్మానించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషిని అధికారులు అభినందించారు.
ఎండిఆర్టీ అర్హత సాధించడం సంస్థ ప్రతిష్ఠను పెంచే విజయమని, భవిష్యత్తులో సుధీర్ కుమార్ మరింతగా రాణించాలని అధికారులు ఆకాంక్షించారు.
ఎండిఆర్టీ అర్హత సాధించిన ముప్పిడి సుధీర్ కుమార్
RELATED ARTICLES


