విశాఖపట్నం, నిఘా న్యూస్: దేశం లో వందే భారత్ పై ఎన్నో అంచనాలు తో భారత రైల్వే శాఖ , దేశ ప్రధాన మంత్రి ప్రారంభించారు. కానీ మొదలు పెట్టిన రోజుల్లో గేద ను గుద్ది నుజ్జు కావటం చూశాము.
సాంకేతిక లోపాలు , ఆలస్యము కావటం లాంటి సమస్యలు ఎన్నో ఉన్నవి. అధిక ధర ఉన్న, గమ్య స్థానం కు వేగం గా వెళ్ళే వెసులుబాటు కోసం ఈ వందే భరత్ లో ప్రయాణికులు వెళ్తున్నారు.
ఎప్పుడు కు అప్పుడు మోరాయిస్తు ఇబ్బందులు గురి చేస్తుంది. నేడు విశాఖ నుండి సికింద్రాబాద్ కు ఉదయం 5.40 కు వెళ్లాల్సిన ఈ రైల్ లో 8 కోచ్ లో సంకేత లోపం కారణంగా రైలు 2.గంటల 40 నిమిషాలు ఆలస్యం గా ప్రత్యామ్నాయము గా విశాఖ నుండి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేసింది. అది సామాన్య ఎక్స్ప్రెస్ రైలు లాంటిది. ఈ రైలు లో 3 ఏసీ 3 కోచ్ లు, 2 ఏసీ 2 కోచ్ లు, 2 స్లీపర్ క్లాస్ కోచ్ లు ఏర్పాటు చేశారు.. దీనిలో ప్రయాణం కొత్త గా వందే భరత్ రైల్ లో ప్రయాణం చేయాలి అనుకున్నవరికి అధిక ధర పెట్టిన రోజు చుసే రైల్ ప్రయాణం చెయ్యలిసి వస్తుంది అని ప్రయాణికులు అవేదన చెందారు.

విశాఖపట్నం – సికింద్రాబాద్ (20833) వందే భరత్ రైల్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్ బయలుదేరాల్సిన ఈ రైల్ లో 8 ఏసీ కోచ్ లలో సాంకేతిక లోపం తలెత్తి మొరాయించడంతో , ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్టెయిర్ డివిజన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ప్రత్యేక రైలు విశాఖపట్నం – సికింద్రాబాద్ (01833)ను ఏర్పాటు చేసింది.13-3ఏసి , 2-2ఏసీ , 02- స్లీపర్ క్లాస్ ,వన్ జనరేటర్ పవర్ కార్ కోచ్‌లను కలిగి ఈ ప్రత్యామ్నాయ రైలు ఉదయం 7:40 గంటలకు (2 గంటలు ఆలస్యంగా) విశాఖపట్నం నుండి బయలుదేరింది. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్‌తో పాటు ఎడిఅర్ఎం (ఆపరేషన్స్) మనోజ్ కుమార్ సాహూ సీనియర్ అధికారులు స్టేషన్‌లోని ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు..ఇప్పటికైనా ఇలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రయాణికులు కోరుకుంటున్నారు.