కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికకు అతి తక్కువ రోజులు ఉండడంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ తనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయని.. కానీ వారి తిట్లే నాకు పూల వర్షం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలపై ఎన్ని విమర్శలు చేసిన తన గెలుపు తధ్యం అంటూ వాక్యానించారు..
ఆల్ఫోర్స్ విద్యా సంస్థల తో దాదాపు తెలంగాణలో గుర్తింపు పొందిన నరేందర్ రెడ్డి పై కొందరు విమర్శలు చేస్తున్నారు. విద్యాసంస్థల ద్వారా ఎంతో సంపాదించిన ఆయన సేవ చేయడానికి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని కొందరు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన నరేందర్ రెడ్డి తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వాటిని నేను పట్టించుకోనని.. నా ధ్యేయం పట్టభద్రులకు సేవ చేయడమేనని ఆయన పేర్కొంటున్నారు. ఎవరిని అడ్డంకులు సృష్టించిన.. ఎన్ని విమర్శలు చేసిన నా గెలుపు ఖాయం అనే విషయం తనకు అర్థం అవుతుందని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు ఎంతో సహకరిస్తున్నారని ప్రచారం చేయడానికి మంత్రులతో సహా ముందుకు వస్తున్నారని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. అలాగే పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడానికి తాను ముందు ఉంటానని పేర్కొంటున్నారు. ఎంతోకాలంగా పట్టభద్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించే సత్తా తనద వద్ద ఉందని నరేందర్ రెడ్డి సందర్భంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారని.. ఎమ్మెల్సీ అయిన తర్వాత వారందరికీ అండగా ఉంటానని ఆయన పేర్కొంటున్నారు.