కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఇటీవల ఉత్సాహభరితంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ నేతృత్వంలోని ప్యానెల్ ఘనవిజయం సాధించింది. బ్యాంక్ డైరెక్టర్గా సరిల్లా రతన్ రాజ్ గెలుపొందడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త పాలకవర్గం ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి.
తాజాగా కర్ర రాజశేఖర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన బ్యాంకు అభివృద్ధి, సభ్యుల సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తానని ప్రకటించారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవి కోసం రతన్ రాజ్ బరిలో ఉన్నారు. తనకు ఇప్పటికే 36 మంది కార్పొరేటర్ల మద్దతు లభించిందని ఆయన తెలిపారు.
ఇక కర్ర రాజశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆయన సూచించారు. బ్యాంక్లో అన్ని వర్గాల ప్రతినిధులకు సముచిత ప్రాతినిధ్యం లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో బ్యాంక్ కార్యకలాపాల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు సభ్యులు అభిప్రాయపడ్డారు.


