పెద్దపల్లి, (నిఘాన్యూస్: పార్లమెంట్ పరిధిలో రాజకీ యాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తి గా మారింద ని చెప్పవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్య ర్థిగా గొమాసే శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ పోటీ చేటీలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ నాయకులు, అంతేకా కుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయా సంఘాలు ఢిల్లీలో కూడా ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్న వయ సులోనే ఏమాత్ర వెనుకడుగు వేయ కుండా వీటన్ని టిని అధిగమించి వ్యతిరేక వర్గాన్ని సైతం కలుపుకు పోవతూ గెలుపు బాట దిశలో వంశీ పయనిస్తు న్నారు క్యాడర్ లో సైతం ఉత్తేజ పరుస్తూ ముందుకు వెళ్తున్నా రు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన భంగపడ్డ గొమాసే శ్రీనివాస్ తనకు టికెట్ రాదని భావించి బీజెపీలో చేరా రు. ఎమ్మా ర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండదం డల తో ఆయన పెద్దపల్లి టికెట్ సాధించి, పార్లమెంటు పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు,
కార్యకర్తలను కలుస్తూ తనను గెలిపించాలని కోరు తున్నారు. అలాగే వివిధ సం ఘా ల నాయకులను సైతం కలుస్తూ మద్దతు కూడగట్టే ప్ర య త్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతుల మద్ద తు కూడగట్టేందుకు ప్రయత్ని స్తున్నారు రైతులు సాగుచేసిన పంటకు సరిపడా సాగు నీరు అందకపోవడంతో కాలువ చివరి ఆయకట్టు భూముల్లో పంటలు ఎండుతు న్నాయి. దీని ఆసరాగా చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా దీక్షల పేరిట ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా దానికి తోడు గులాబీ బాస్ తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ తమ అభ్యర్థు లను గెలిపించాలని అభ్యర్థిస్తూ బస్సు యాత్రతో బీఆర్ఎస్ నాయ కులను పార్టీ నుండి వీడ కుండా శ్రేణులు ఉత్తేజపరుస్తూ సాగుతున్నా రు. ఓటర్లు ఎవ రికి పట్టం కడతారనేది వేచి చూడాలి


