కరీంనగర్, నిఘా న్యూస్: వర్గాలకతీతంగా పనిచేస్తున్న జూలపల్లి మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ పనితీరును పలువురు ప్రశంశీస్తున్నారు… తనను మండల అధ్యక్షులుగా నియామకం చేసి, రాజకీయ బిక్ష పెట్టింది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు అయినప్పటికీ ప్రతిరోజూ ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా ఉండే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి నాయకత్వమే మాకు శరణ్యం అని గుజ్జులతో కలిసి పనిచేయడం ఆశ్చర్యపోవడమే కాకుండా ఆహ్వానించదగ్గ పరిణామంగా పరిశీలకులు చర్చించుకుంటున్నారు..
వివరాల్లోకి వెళితే పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గత పదేళ్లుగా బీజేపీ కార్యకర్తలు గుజ్జుల వర్గం, దుగ్యాల వర్గాలుగా విడిపోయి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం అయ్యేంతవరకుకూడా పెద్దపల్లి జిల్లాలో గుజ్జుల చేతిలోనే బీజేపీ కార్యకలాపాలు నడిచేవి. కానీ సంజయ్ రాష్ట్ర చీఫ్ అయ్యాక దుగ్యాల ప్రదీప్ రావును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించవే కాకుండా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైతం టికెట్ ఇప్పించారు దీంతో పెద్దపల్లి జిల్లాలో దుగ్యాల ప్రదీప్ రావు చేతికి బిజెపి పగ్గాలు వచ్చినట్లు అయింది. దాంతో మండల అధ్యక్షుల నీయామకం సమయంలో తన వర్గానికి దక్కేందుకు విశ్వప్రయత్నం చేసితన అనుచరులకు ఇప్పించుకున్నాడు. అయితే అధ్యక్షులను ఇప్పించుకోవడంలో విజయవంతమైన ప్రదీప్ రావు వారిని కాపాడుకోవడంలో విఫలం కావడం ఆయన నాయకత్వ లేమికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. అయితే హైదరాబాదు నగరానికే పరిమితమయ్యే దుగ్యాల ప్రదీప్ కుమార్ వ్యవహారశైలితో ఆయన వెంట తిరిగే కార్యకర్తలే చాలామంది దూరమయ్యారు.
తనను నమ్ముకున్న కార్యకర్తలైనా సరే తన మాట వినకపోతే ధృతరాష్ట్ర కౌగిలిలో నలిపేయడం, పదవులకు దూరంగా ఉంచుతూ నట్టేట ముంచుతూ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాడని ప్రదీప్ రావు వైఖరి పైన మొన్నటిదాకా ప్రదీప్ రావు వెంట ఉన్నవివిధ మండలాలకు చెందిన కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు పెద్దపల్లికి వచ్చిపోయే టూరిస్ట్ నేతగా ప్రదీప్ కుమార్ కు ముద్ర వేసి గుజ్జుల వర్గం నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో దుగ్యాల ప్రదీప్ రావు తీరుతో విసిగిపోయిన జూలపల్లి మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ వర్గాలకు అతీతంగా పనిచేస్తూ గుజ్జుల నాయకత్వాన్ని బలపరిచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నాడు.
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అండగా ఉండే గుజ్జుల రామక్తిష్ణారెడ్డి నాయకత్వమే శరణ్యమని అయన నేత్రుత్వంలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నాడు. రామకృష్ణ రెడ్డీతో కలిసి ప్రెస్ మీట్ లు పెట్టడమే కాకుండా, వివాహాలకు, పరామర్షలకు సైతం గుజ్జులతో కలిసి అడుగులో అడుగేయడంతో మహేష్ దుగ్యాల ప్రదీప్ రావు కు జూలపల్లి మండలంలో చెక్ పెట్టినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జూలపల్లి మండల కేంద్రంలోని గుజ్జుల సామాజిక వర్గంకు చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలివిగా వ్యవహరించి దుగ్యాల ప్రదీప్ రావుకు చెక్ పెట్టి గుజ్జుల నాయకత్వంలో పనిచేసేలా మహేష్ ను చాకచక్యంగా రప్పించినట్లు తెలిసింది. దీంతో మండల అధ్యక్షునిగా కొప్పుల మహేష్ ని నియమించే విషయంలో ప్రదీప్ రావు ఎంతో శ్రమకోర్చి, చాలా మంది సీనియర్ ల అభిప్రాయాలను కాదని తన పంతం నెగ్గించుకునేందుకు కృషి చేస్తే గుజ్జుల సామాజిక వర్గం ఎత్తుల ముందు ప్రదీప్ రావు మంత్రాంగం పనిచేయలేదని ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిందని, తాడిని తన్నే వాడుంటే తలను తన్నేవాడుంటాడని, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోచమ్మ కొడుతుందని నిరూపితమయిందని పరిశీలకులు చర్చించుకుంటున్నారు.