కరీంనగర్, జూన్ 17( నిఘా న్యూస్): నగరంలోని రేకుర్తి రెవె న్యూ పరిధిలోని 18వ డివిజన్లో భూ బకాసురుల బాగోతం మరో మారు బట్టబయలైంది. రేకుర్తి రెవెన్యూ పరిధిలో 230 మాత్రమే సర్వే నెంబర్లు ఉండగా, తాజాగా 231, 232, 233 అనే నెంబర్లతో ఏకంగా దొంగ సర్వే నెంబర్లను భూమాఫీయా కొత్తగా సృష్టించింది. 227 సర్వే నెంబర్లో షేక్ సాజిదాకు చెందిన 19 గుంటల భూమిని పైన తెలిపిన దొంగ సర్వే నెంబర్లను సృష్టించి, నకిలీ భూ పత్రాలు తయారు చేయించి, ఆక్రమించిన అంశంలో కరీంనగర్ ఫతేపురాకు చెందిన షేక్ అబూబకర్ ఖాలీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కరీంనగర్ ఎమ్మెల్యే అనుచరుడు నందెల్లి మహిపాల్ పై ఏ1గా కేసు నమోదయిందని ఫిర్యాదుదారుడు షేక్ అబూబకర్ ఖలీద్ మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫిర్యాదు దారుడు వెల్లడించిన కేసు వివరాల్లోకి వెళితే, రేకుర్తి గ్రామ రెవెన్యూ శివారు AK 2.3.227 5 2 1.20 ఎకరాల భూమి 1954-55 ఖాస్రా పహాని ప్రకారంగా పట్టా దారుల పట్టాదారు అయిన షేక్ సాజిద, తన అమ్మమ్మ, తాత షేక్ సాలం, భర్త షేక్ సాలెహ్ పేరిట పట్టా కలదు. అప్పుడు సాజిద తాత భూములు పంచగా సర్వేనెం. 227 పూర్తి విస్తీర్ణం 1.20ఎకరాల భూమి, మాఅమ్మ షేఖ్ బీ, తండ్రి షేక్ సాలెహ్ కి ఇచ్చారు. 1954-55 పహాని కాస్తూ కాలంలో హిస్సిదారీ అని కూడా మాఅమ్మ పేరు నమోదు కాబడింది. ఆ తర్వాత మా అమ్మ పేరిట ఉన్న ఆస్తులు వారసులైన మేము పంచుకొనగా సర్వే, నెం.227 లో విస్తీర్ణం 1.20 ఎకరాల భూమిని, పేఖా సాజిదా, తండ్రి పేఖ్ సాలేహ్ కి
వచ్చినది తన సోదరుడైన షేక్ అబూబకర్ ు జీపీఏ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి దాకా 2014-15 వరకు పహానిలో కూడా నమోదు అయ్యి వున్నారు. మార్చి 2024 లో కరీంనగర్ వచ్చిన తర్వాత సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోగా 231,232, 233 సర్వే నంబర్లు రేకుర్తి రెవెన్యు రికార్డులో లేవని 230 సర్వే నెంబర్ వరకే వున్నాయని తెలిసింది. ఆ తర్వాత నేను భూమి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నన్ను నా పని వారిని వేధిస్తూ మా భూమి ఇది, మీకు భూమి లేదంటూ మా భూమిని కబ్జా చేయాలనే దుర్బుద్ధితో నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదుదారుడు షేక్ అబుబకర్ ఖలీద్ పోలీసులను ఆశ్రయించాడు. నందేల్లీ మహిపాల్ బండి పల్లి సురేందర్ బండారి మారుతీలు ముగ్గురు కలిసి పధకం ప్రకారం కుట్ర పన్ని భూమి లేని వారికి భూమి వున్నట్టు పైన పేర్కొన్న అస్తపురం కుటుంబీకుల పేర్ల పై దొంగ సర్వే నెంబర్లు వేసి దొంగ దస్తావేజులు తయారుచేసిన అంశంలో కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి కేసు నమోదు చేసినట్లు అబూబకర్ తెలిపారు.
భూ బకాసురుల బాగోతం మరో మారు బట్టబయలు..
RELATED ARTICLES