కుసులవాడ పంచాయితీ లో వైసిపి ఖాళీ
విశాఖపట్నం,ఏప్రిల్ 21, నిఘా న్యూస్: ఆనందపురం మండలం కుసులువాడ గ్రామం లో వైసీపీ ఖాళీ. ఆ గ్రామ సర్పంచ్ సహా మొత్తం పంచాయతీ కార్యవర్గం ఆదివారం గంట సమక్షం లో టిడిపి లో చేరింది. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వీరందరికీ టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలో కి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని కల్లబొల్లి మాటలు తో దగా చేశారన్నారు. టిడిపి పార్టీలో చేరిన వారందరి కీ తగిన ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం పై నమ్మకం తో గ్రామాలు మొత్తం వైసీపీని వీడి టిడిపిలోకి చేరుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిన వారిలో కుసులువాడ సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మి శివాజీ, ఉప సర్పంచ్ అత్తి రామా రావు, వార్డు సభ్యులు తోమురోతు లక్ష్మి, కోరాడ పైడిరాజు, చింతాడ వెంకట సూర్యనారాయణ, రవ్వ లక్ష్మి, పిల్లా పార్వతి, ఈగల వెంకట రమణ,రేగాని రాము,రేగాని అప్పలనాయుడు, వరపుల గౌరి సహా గ్రామానికి చెందిన 500 కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు త దితరులు పాల్గొన్నారు.