Thursday, March 5, 2026

రాజన్న క్షేత్రంలో శివార్చన ఘన ప్రారంభం…

వేములవాడ, నిఘా న్యూస్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శివార్చన కార్యక్రమానికి ఘన ఆరంభం లభించింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై, భగవంతుని కృపకు పాత్రులయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ , ఆది శ్రీనివాస్ శివార్చనలో పాల్గొని భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను పొందారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “మహాశివరాత్రి అనేది ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక. ఈ శివార్చన ద్వారా భక్తులందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

రాజన్న క్షేత్రంలో నిర్వహించిన ఈ విశిష్టమైన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని శివుడిని ఆరాధించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular