Thursday, February 26, 2026

కాంగ్రెస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం..

కాంగ్రెస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం..

కార్పొరేషన్ ఎన్నికల్లో
కాంగ్రెస్ కు పట్టం కట్టండి..

పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం..

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు..

కరీంనగర్, నిఘా న్యూస్: కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన అనంతరం కరీంనగర్‌కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నగరాన్ని ఖతర్నాక్‌గా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు.

కరీంనగర్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యంతో శుక్రవారం రాత్రి వెలిచాల రాజేందర్ రావు‘బస్తిబాట’ పేరిట కాంగ్రెస్ నేతలతో కలిసి వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. నగరంలోని30 డివిజన్ లో కాంగ్రెస్ నాయకుడు కళ్ళేపల్లి బాలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ ప్రజలతో రాజేందర్రావు మమేకమయ్యారు. ఇంటింటా తిరుగుతూ మౌలిక సదుపాయాలు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్ వంటి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలు నోట్ చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వరదలా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని కరీంనగర్ ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మరి ఏ పార్టీతోను అభివృద్ధి సాధ్యం కాదని కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా కల్పించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆశీర్వదించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో నగరాభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఎలాంటి లోటు ఉండదని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే కరీంనగర్ రూపురేఖలే మారుతాయని రాజేందర్‌రావు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రతి డివిజన్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

బస్తిబాట కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కల్లెపల్లి బాలరాజు, గండి రాజేశ్వర్, ఎండి సలీం, బట్టు వరప్రసాద్, గండి శ్యామ్, గండి గణేష్, కాసారపు కిరణ్ కుమార్ సలీం, డివిజన్ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular