హైదరాబాద్, నిఘా న్యూస్: పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య ను ఈరోజు ఉదయం వరకు 42 గా అధికారులు ప్రకటించారు ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతుంది, పూర్తి తొలగింపు తర్వాతే మృతుల సంఖ్య పై స్పష్టత రానుంది….
పాశమైలారం లో పారి శ్రామిక వాడలో జరిగిన భారీ ప్రమాదం లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 37 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 9 గంటలకు రియాక్టర్ పేలడం తో.. ఓ భవనం కూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో.. శిథిలాల కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగగా.. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది.
అధికారులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఈ రోజు 9 గంటలకు మృతుల సంఖ్య 42 కు చేరింది. అలాగే మరో 20 మంది వరకు శిథిలాల కింద ఉన్న ట్లు తెలుస్తుంది. వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం ఫైర్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.