బిఆర్ఎస్ నేత కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలి
బిజెపి పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేసే దమ్ము బండి సంజయ్ కి ఉందా..?
సత్తు మల్లేశం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కరీంనగర్, నిఘా న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కులగనన చేపట్టి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించాలని, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం చేసేందుకు ఢిల్లీలో చేపట్టిన ధర్నాతో యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని కరీంనగర్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఎస్సీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో కరీంనగర్ జిల్లా నుండి అందరూ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశామన్నారు.
ఆనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రోజున బిజెపి, బిఆర్ఎస్ ఆమోదించి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించిన తర్వాత బీసీల పైన వారికి ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయటపడింది, నేడు బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మరొక మంత్ర కిషన్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల నుండి మైనారిటీలను తీసినట్లయితే మేము బిల్లు ఆమోదింప చేస్తామని అన్నారు. బిజెపి నేత నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం అయిన మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఆయా రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ముందు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయాలని అంతే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మిత్రపక్షమైన టిడిపి పార్టీకి చెందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను తొలగిస్తేనే మీతో మిత్రపక్షంలో కొనసాగుతామని మీరు వారిని డిమాండ్ చేయాలని కోరుతున్నాము. బండి సంజయ్ కుమార్ గారికి బీసీల పైన దళితుల పైన గాని ఏమాత్రం విశ్వాసం ప్రేమ ఉన్నట్లయితే, ఒక బిసి కాబట్టే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు నిన్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించి అదేవిధంగా మంత్రి స్థాయి వరకు వెదిగే విధంగా ప్రోత్సహిస్తే మీకు ఏమాత్రం బీసీలపైన ప్రేమ ఉన్నా ఈ బీసీ బిల్లును ఆమోదింపజేసి నువ్వు ఈ బీసీల పైన కచ్చితంగా నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా డిసెంబర్ 2 రాజ్యసభలో ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను దేశ ప్రజలు మరిచిపోలేదని, భారత రాజ్యాంగాన్ని నిర్మించే సమయంలో అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఒక ఆలోచన చేయడం జరిగింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రశ్నించడం మీవల్ల కాకపోతే మన రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చే నిధులను తీసుకురావాలని అందు గురించి ప్రయత్నం చేయాలని కోరుతున్నాము, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుల సంక్షేమం కోసం 56 వేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత ఈ ప్రజా పాలన ప్రభుత్వానిది అని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ప్రభుత్వము పక్షాన రైతన్నలకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుందని, సంక్షేమ పాలన విషయంలో భాగంగా ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేదలకు కడుపునిండా సన్న బియ్యం ఇస్తుందని బండి సంజయ్ గారు తమ ప్రభుత్వ నేతలకు గర్వంగా చెప్పాలని కోరుతున్నామన్నారు.
కుల మత రాజకీయాలతో రాజకీయ ఒబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలందరూ మీ యొక్క పనితీరును గమనిస్తున్నారని చెప్పారు.
బీసీల పట్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులది మరొక తీరు, ఆనాడు ప్రజాల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించేందుకు హైదరాబాదులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. కానీ ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం వారి పార్టీ ఉనికి కోసం మాత్రమే ప్రజలు ఛీ కొడుతూ చిరస్కరించినప్పటికీ అదే ధర్నా చౌక్ లో ధర్నా చేపడుతున్నారు, ఆ ధర్నా చౌక్ ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ధర్నా చౌకు ఏర్పడిన తర్వాత ఈ టీఆర్ఎస్ నాయకులు పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటున్నారు.
బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కు ఏమాత్రం బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఏం డి తాజ్,భానోతు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, అబ్దుల్ రెహమాన్, జెల్లోజి రాజు, గంగుల దిలీప్, అడపసాగర్,అమీర్… తదితరులు పాల్గొన్నారు