వేములవాడ,నిఘాన్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలోని హుండీ లెక్కింపులో మొత్తంరూ.1,15,17,894/- నగదు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు లభించినట్లు పేర్కొన్నారు.ఈ హుండీ లెక్కింపును ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ కార్యాలయ అధికారి రాజమౌళి, ఆలయ ఇన్‌చార్జ్ ఏఆర్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికిరణ్ పర్యవేక్షణలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, ఇతర అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
భీమేశ్వర స్వామి ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు
RELATED ARTICLES


