పెద్దపల్లి, నిఘా న్యూస్:పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను నియమించ లేదని లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అసత్య ఆరో పణలు చేస్తున్న నూతన కౌన్సిలర్ పోతర బోయిన శ్రీలత క్రాంతి మతిబ్రమిం చి మాట్లాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
పోతర బోయిన శ్రీ లత క్రాంతి, చేస్తున్న ఆరోపణ లో ఎలాంటి నిజం లేదని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు గుండ రాజు, తీగల సమ్మయ్య, పోలు శివ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణంలోని ఆరో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలో 13 వార్డులలో ఏ వార్డులో లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వినతి మేరకు 54 ఇండ్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంజూరు చేయిం చాడని వారు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని పూర్తి సహకారం అందిస్తామని, ఎవరైనా లబ్ధిదారులను బెదిరింపులు గురిచేస్తే తమ దృష్టికి తీసుకురా వాలని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని వారు పేర్కొన్నారు.
కొందరు తమ రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ పార్టీని పార్టీ కార్యకర్తలను బదునం చేస్తున్నారని పోతారవేణి రాజయ్య, అట్టెం వినయ్, కొంతం శ్రీను, మోహన్, నాయని సంతు ఆరోపించారు.


