అమరావతి, నిఘా న్యూస్: ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్న 20 కార్పొరేషన్ల సభ్యులను నియమించింది.కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినే టెడ్ పోస్టులను భర్తీ చేసింది ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ 16 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కగా..
జనసేన పార్టీకి మూడు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయ ణను నియమించగా.. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ను నియమించింది.అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, శాప్ చైర్మన్ గా రవినాయుడును ప్రభుత్వం నియమించింది.
పదవులు దక్కిన ఆశవహులు వీరే
వక్ఫ్ బోర్డు చైర్మన్ – అబ్దుల్ అజీజ్ (టీడీపీ)
శాప్ చైర్మన్ – అనిమిని రవి నాయుడు (టీడీపీ)
గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు (టీడీపీ)
ఏపీ ట్రైకార్ చైర్మన్ : బొరగం శ్రీనివాసులు (టీడీపీ)
ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య (టీడీపీ)
సీడాప్ చైర్మన్ : దీపక్ రెడ్డి (టీడీపీ)
మార్క్ ఫెడ్ చైర్మన్ : కర్రోతు బంగార్రాజు (టీడీపీ)
సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ : మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)
ఏపీఐఐసీ చైర్మన్ :మంతెన రామరాజు (టీడీపీ)
పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ : నందం అబద్దయ్య (టీడీపీ)
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ : నూకసాని బాలాజీ (టీడీపీ)
ఏపీ ఆర్టీసీ చైర్మన్ :కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ)
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ : పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)
లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ : పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)
వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ :పీతల సుజాత (టీడీపీ)
ఏపీటీపీసీ చైర్మన్ : వజ్జ బాబూరావు (టీడీపీ)
ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్: తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ :తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
ఏపీ టిడ్కో చైర్మన్ – వేములపాటి అజయ్ కుమార్ (జనసేన)
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ – లంకా దినకర్ (బీజేపీ)