Thursday, March 5, 2026

మున్సిపల్ టెండర్లలో గుత్తేదారుల పక్కా ప్లాన్..? ప్రభుత్వ ఆదాయానికి గండి!

కరీంనగర్, నిఘా న్యూస్:కొన్ని రోజుల కిందట తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు గుత్తేదారులు ఆందోళన చేశారు. అలాగే తక్కువ కమిషన్ వచ్చే పరులకు టెండర్లను వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు నిధులు ఉండి చేసే పనులపై మున్సిపల్ శాఖ టెండర్లు ఆహ్వానించడంతో గుత్తేదారులు తక్కువ ధరకే టెండర్లు దక్కించుకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. ఇటీవల కొందరు గుత్తేదారులు సమావేశమై ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాకుండా ప్లాన్ చేశారు ఆ వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు ఇటీవల ఈ ప్రోక్యూర్మెంట్ టెండర్లను ఆహ్వానించారు. మొత్తం 55 పనుల కోసం రూ. 4 కోట్లను కేటాయించారు. ఈ పనుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, శ్మశాన వాటికల్ ఆధునికీకరణ, వీధి దీపాలు వంటివి ఉన్నాయి. వీటితోపాటు సూడా పరిధిలో 18 పనుల కోసం టెండలను పిలిచారు. అయితే ఈ నెల 16 వరకు టెండర్ల గడువు ఉండగా.. మూడు పనుల కోసం మాత్రం ఒక్కరు ముందుకు రాలేదు. కానీ ఒక పని కోసం మాత్రం తీవ్రంగా పోటీపడ్డారు. ఈ పనిని దక్కించుకోవడానికి గుత్తేదారులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

టెండర్లలో మొత్తం 60 మంది గుత్తేదారులు పాల్గొని ముందస్తుగా రూ. 30 వేల చప్పున డిపాజిట్ చేశారు.
ఇలా మొత్తం 18 లక్షలు జమ చేసి ఒక్కో పని మీద 15% మించకుండా వేలంపాట నిర్వహించేలా వ్యూహం పన్నారు. మరోవైపు రూ. 12 లక్షలు సేకరించి మొత్తం 30 లక్షల పనులు చేయని గుత్తేదారులకు వాటిని చెల్లించనున్నారు. అంటే పోటీ లేకుండా తాము కోరుకున్న ధరలకే టెండర్లను దక్కించుకోవడానికి గుత్తేదారులు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం. వీరి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉందని కొందరు ఆందోళన చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆన్లైన్ టెండర్ పిలవడంతో ఎవరైనా ఇక్కడి నుంచి అయినా పాల్గొని వీలు ఉంది. అయితే ఆన్లైన్లోనూ ఎవరూ పాల్గొనకుండా వీరు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular