Thursday, February 26, 2026

కరీంనగర్ కాంగ్రెస్ పదవులపై ఉత్కంఠ..

స్థానిక ఎన్నికలపై నిర్ణయంతో కార్యకర్తల్లో ఆశలు..

ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయోనన్నా తీవ్ర చర్చ

మరోసారి వెలిచాల రాజేందర్రావు పేరు తెరపైకి

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల పార్టీ వర్గాల్లో వెలిచాల రాజేందర్‌రావు పేరును ఎమ్మెల్యేలు, నేతలు చర్చించుకోవడంతో ఆయనకు ఈ బాధ్యతలు దక్కుతాయన్న ప్రచారం బలంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావడం లేదు. దీంతో కార్యకర్తలు ఇంకా స్పష్టత కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు కూడా అధ్యక్ష బాధ్యతలకు ముందుకు రావడంతో చర్చ కొత్త మలుపు తిరిగింది. పార్టీ బలంగా నిలవాలంటే భౌగోళిక సమతుల్యత, రాజకీయ అనుభవం రెండు ముఖ్యం అనే అభిప్రాయం కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. సత్యం పేరు రావడంతో సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

మధ్యలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా అక్కడే బిజీ అయ్యారు. ఈనేపథ్యంలో కరీంనగర్ జిల్లా పదవులపై నిర్ణయం కొంతకాలం వాయిదా పడింది. ఇప్పుడు ఉపఎన్నిక ముగియడంతో మళ్లీ దృష్టి కరీంనగర్ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా నాయకత్వంపై త్వరలో చర్చలు వేగం పెరిగే సూచనలు ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలతో కార్యకర్తల్లో కొత్త ఆశలు

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకోవడంతో కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఆశలు పెరిగాయి. జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నియామకాల ద్వారా పార్టీని శక్తివంతం చేసే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ రెండు కీలక పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ జిల్లా వ్యాప్తంగా వేడెక్కింది. పార్టీ నేతల నిర్ణయంపై అందరి చూపులు నిలిచాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular