Sunday, August 31, 2025

భువనగిరిలో ఉద్రిక్తత?

యాదాద్రి జిల్లా, నిఘా న్యూస్:యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల యంపై NSUI కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిం చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు.

దీంతో భువనగిరి పట్టణం లో హై అలర్ట్ నెలకుంది, కాంగ్రెస్ దాడికి నిరసనగా భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తాలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్ట నున్నట్లు టిఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమ య్యారు.

అయితే దాడి గురించి తెలుసుకున్న కారు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తు న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడిస్తా మని బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పలేక దాడులా భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ..”ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది.

ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారు. కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించింది.

ఇది అత్యంత హేయమైన చర్య. ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామా గా మారింది.

దాడులు, గుండాగిరి తమ మార్కు పాలనని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించు కుంది. మా పార్టీ కార్యకర్త లు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతోపాటు, వారి వెనక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని” అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular